గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (12:03 IST)

ప్రధాని మోడీకి సానుభూతిని తెలిపిన రాహుల్ గాంధీ

modi heeraben
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మరణించిన వార్త నిజంగానే ఎంతో బాధించింది. ఈ కష్టకాలంలో ప్రధాని మోడీ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ప్రేమను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. 
 
అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ట్విట్టర్‌లో తమ సంతాపం తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. ప్రధాని మోడీకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. 
 
కాగా వందేళ్ల వయసున్న ప్రధాని మోడీ హీరాబెన్ శుక్రవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ పూర్తి చేశారు.