బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (09:22 IST)

తెలంగాణాలో 783 గ్రూపు-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

telangana state
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజాగా మరో గ్రూపు-2 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటికే వివిధ రకాల పోస్టులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే.
 
ఇపుడు మరోమారు నోటిఫికేషన్‌ను జారీచేసింది. దీని ప్రకారం 783 గ్రూపు-2 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అత్యధికంగా 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, 98 తాహసీల్దారు పోస్టులు ఉన్నాయి. 
 
ఈ గ్రూపు-2 ఉద్యోగాలకు వచ్చే యేడాది జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిని పంపేందుకు ఆఖరు తేదీ వ్చచే ఫిబ్రవరి 18. పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.