1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (15:05 IST)

తెలంగాణాలో మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ

tspsc
తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని పోస్టుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. గ్రూప్-2, 3 ఉద్యోగ నోటిఫికేషన్లకు విడుదలకు ఏర్పాట్లుచేశారు. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరికొన్ని పోస్టులను కూడా చేర్చడంతో తాజాగా వాటి సంఖ్య పెరగనుంది. దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులను కలపడంతో గ్రూపు 2 కింద మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అటు గ్రూపు 3లో కూడా కొత్త పోస్టులను చేర్చనున్నారు.
 
ఇప్పటికే గ్రూపు-2 కింద 663, గ్రూపు-3 కింద 1373 పోస్టులను గుర్తించిన కమిషన్ అదనంగా మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అనుమతిచ్చింది. గ్రూపు-2 కింద సంక్షేమ శాఖలో అసిస్టెంట్ వెల్ఫేర్ అఫీసర్ పోస్టులు 43 వరకు, శిశు సంక్షేమ శాఖలో 11 జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను కలిపి మొత్తం 100 వరకు పోస్టులు పెరగనున్నాయి.