సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (18:53 IST)

35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న రైల్వే శాఖ

railway ministry
రోజ్ గార్ మేళాలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేశాఖలో ఏకంగా 35 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లను కూడా పూర్తి చేస్తామని తెలిపింది. ఈ నియామక పోస్టులను భర్తీ చేసి 2023 మార్చి 31వ తేదీ నాటికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపింది. అలాగే, పోస్టుల భర్తీ కోసం ఒకదాని తర్వాత ఒక నోటిఫికేషన్ ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. 
 
వచ్చే యేడాది మార్చిలోగా 35,281 ఉద్యోగాల భర్తీకి రైల్వే బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పిటకే జారీ చేసిన ప్రకటనలు, నియామక ప్రక్రియ, వివిధ దశలలో ఉన్న వాటిని వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నట్టు రైల్వే బోర్డు ఈడీ అమితాబ్ శర్మ వెల్లడించారు. 
 
గత 2019లో జారీ చేసిన నాన్ టెక్నికల్ పాపులర్ విభాగంలో పోస్టుల భర్తీకి 2021లో రైల్వే బోర్డు పరీక్షలు నిర్వహించింది. ఇందులో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్, గూడ్స్ గార్డు, కమర్షియల్ అప్రెంటీస్ టిక్కెట్ క్లర్కులు, సీనియర్ క్లర్కులు కమ టైపిస్టులు, టైంకీపర్ తదితర ఉద్యోగాలకు దశల వారీగా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి 2013 మార్చి 31వ తేదీనాటికి ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికీ నియామక పత్రాలను అందజేసేలా చర్యలు తీసుకోనున్నట్టు ఆమితాబ్ శర్మ తెలిపారు.