గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (17:06 IST)

ఆగస్టు ఒకటి నుంచి రైల్వే స్టేషన్లలో కొత్త నిబంధనలు

railway station
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల మేరకు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలపై అన్ని అమ్మకాలకు క్యాష్‌లెస్ చెల్లింపులు మాత్రమే జరపాలన్న నిర్బంధ నిబంధనను ప్రవేశపెట్టనుంది. అలాగే, ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఈ కఠిన నింబధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి విధిగా అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 
 
రైల్వే బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్‌తో పాటు అన్ని స్టాల్స్‌లో నగదు స్వీకరించేందుకు వీలుండదు. అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే విక్రయిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం రూ.10 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, స్వైపింగ్ మెషీన్లను షాపు యజమానులు కలిగివుండాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతి విక్రయానికి తప్పకుండా కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన కూడా విధించింది.