బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (12:13 IST)

పశ్చిమ మధ్య రైల్వేలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు...

railway job
పశ్చిమ మధ్య రైల్వేలో పదో తరగతి విద్యార్హతపై ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 2521 పోస్టులను భర్తీ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీలో భాగంగా, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, బ్లాక్ స్మిత్, వెల్డర్ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్‌ను కూడా కలిగివుండాలి. అభ్యర్థుల వయసు 2022 నవంబరు 17వ తేదీ నాటికి 15 యేళ్ల నుంచి 24 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి ఉంటుంది.  
 
ఈ దరఖాస్తులను డిసెంబరు 17వ తేదీ రాత్రి 22 గంటల 59 నిమిషాలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. షార్ట్ లిస్ట్, అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైఫండ్ చెల్లిస్తారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూసి తెలుసుకోవచ్చు.