బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (12:01 IST)

ఏపీ వర్శిటీ.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

students
ఏపీ వర్శిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను గురువారం యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి విడుదల చేశారు. మొత్తం 16 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 145 కోర్సుల్లో ఈ సెట్‌ ద్వారా ప్రవేశాలు జరుపనున్నారు. 
 
ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు దాఖలుకు గడువు జూలై 20. కాగా, ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. డిగ్రీ చివరి సెమిస్టర్‌ చదువుతున్నవారు సైతం ఏపీపీజీసెట్-2022 రాసేందుకు అర్హులు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 27వ తేదీ వరకు, అలాగే రూ.1000 ఆలస్య రుసుంతో జులై 29వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు.
 
పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సౌకర్యార్ధం హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.