మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (13:30 IST)

27న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల

అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. అమ్మ ఒడి పథకం కింద ఒక్కో విద్యార్థికి యేడాదికి రూ.15 వేలను విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ యేడాడి రూ.13 వేలు మాత్రమే జయ చేయనుంది. అయితే, డబ్బులు తగ్గించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ పథకం కోసం ఈ యేడాది ప్రభుత్వం రూ.6500 కోట్లను కేటాయించింది. 
 
ఇదిలావుంటే, గత యేడాది అమ్మ ఒడిపథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ యేడాది లక్ష మందిపైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది. హాజరురాలేదన్న కారణంగా 51 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చేసింది. ఇతర కారణాల వల్ల మరో 50 వేల మందిని తొలగించింది.