శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (12:30 IST)

తిరుపతిలో సీఎం జగన్.. శ్రీవకుళమాత ఆలయ ప్రారంభోత్సవం

ys jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 11 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. 11.15 నుంచి 11.45 గటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలరూలు చేరుకుని హిల్ టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షకల తయారీ యూనిట్ నిర్మాణ భూమిపూజలో పాల్గొన్నారు. 
 
మధ్యాహ్నం ఒంటి గంటలకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ-1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేర 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.