సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2022 (12:35 IST)

పదో తరగతి విద్యార్హతతో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్‌లో ఉద్యోగాలు

jobs
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్‌లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా పదో తరగతి, డిప్లొమో విద్యార్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భర్తీ చేయనున్నారు. మొత్తం 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
 
ఈ పోస్టుల భర్తీ కోసం తగిన గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి పదో తరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 యేళ్లకు మించివుండరాదు. 
 
అభ్యర్థుల తమ దరఖాస్తులను పోస్టు ద్వారా ఈ నెల 26వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. నెలాఖరున సర్టిఫికేట్లను పరిశీలించి, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా డిసెంబరు 5వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. భర్తీ చేసే ఉద్యోగాల్లో నాలుగు ల్యాబ్ టెక్నీషియన్, ఆు ఫార్మాసిస్ట్, నాలుగ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏడు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తారు.