శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2022 (12:28 IST)

బంగాళాఖాతంలో వాయుగుండం : మూడు జిల్లాలో భారీ వర్ష సూచన

rain
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది చెన్నకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ  శాఖ తెలిపింది. 
 
ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంగా మారి వచ్చే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించారు.
 
ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. అందువల్ల మంగళవారం వరకూ సముద్రంలోకి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 
 
రాబోయే రెండో రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్ర అల్పపీడనం మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. 
 
పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వచ్చే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకునివున్న  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.