1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
  4. NHPC Recruitment 2021 Notification Released for 53 Job Vacancies Salary

పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్.హెచ్.పి.సి నోటిఫికేషన్ జారీ

NHPC Recruitment 2021
నేషల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్.హెచ్.పి.సి)లోని పలు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీచేసింది. తగిన విద్యార్హతలతో పాటు ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
మొత్తం 67 ఖాళీలు ఉన్నాయి. గేట్-2021లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అంటే గేట్ పరీక్షను రాసిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుల దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు నెలవారి వేతనం చెల్లిస్తారు. 
 
ఖాళీళ వివరాలను పరిశీలిస్తే, ట్రైనీ ఇంజనీరింగ్ (సివిల్) విభాగంలో 29, ట్రైనీ ఇంజనీరింగ్ (మెకానికల్)లో 20, ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)లో 4, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్)లో 12, ట్రైనీ ఆఫీసర్ (కంపెనీ సెక్రటరీ)లో 2 చొప్పున మొత్తం 67 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టు కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఎన్.హెచ్.పి.సి వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 
తర్వాతి కథనం
నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన