శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (12:24 IST)

హైదరాబాద్ నగరంలో బాలిక మిస్సింగ్.. చెరువులో శవమై తేలింది...

girl missing
హైదరాబాద్ నగరంలో అదశ్యమైన ఓ బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆ బాలిక చెరువులో శవమై తేలింది. గురువారం కనిపించకుండా పోయిన ఈ చిన్నారి శుక్రవారం చెరువులో శవంగా కనిపించింది. దమ్మాయిగూడకు చెరువులో ఆ బాలిక మృతేదహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే, మృతదేహాన్ని తల్లిదండ్రులతో పాటు స్థానికులకు చూపించకుండా పోలీసుల ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. తమ బిడ్డ గురువారం ఎప్పటిలాగానే స్కూలుకు వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. కానీ, మధ్యాహ్నానికి పాప కనిపించడంలేదంటూ స్కూల్ నుంచి ఫోన్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పైగా, ఆ పాపకు చెందిన స్కూల్ బ్యాగు, పుస్తకాలు తరగతి గదిలోనే ఉన్నాయని, కానీ, పుస్తకాలు లేవని టీచర్ సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పుటేజీలను సేవకరించి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఆ బాలిక దమ్మాయిగూడ చెరువులో శవమై కనిపించింది.