ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (18:30 IST)

1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్

Jobs
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. 
 
ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్పీ సెక్రటరీ అనితా రామచంద్రన్ చెప్పారు. మొత్తం జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు అనితా రామచంద్రన్ వెల్లడించారు.