గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (16:07 IST)

నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు నోటిఫికేషన్

nurse
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వరుసగా నోటిఫికేషన్లు జారీచేసింది. తాజాగా 4,661 నర్సుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబరు 31వ తేదీ లోపు నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అర్హత పరీక్షను నిర్వహించనున్నారు.
 
పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హులను ఎంపిక చేయనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టిసారించింది. 
 
టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూన్యాంకనం, ఫలితాల వెల్లడికి ఏవైతే నిబంధనలు పాటిస్తుందో అది విధానాన్ని స్టాఫ్ నర్సుల నియామకాల్లో అనుసరించాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది.