1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 16 డిశెంబరు 2022 (23:33 IST)

ఐబీసీ ఆల్ట్‌ హ్యాక్‌ వైజాగ్‌ ఎడిషన్‌ ప్రారంభం

image
భారతదేశంలో సుప్రసిద్ధ బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3.0 ఎడ్యుకేషన్‌ అగ్రగామి సంస్థ ఐబీసీ మీడియా నేడు తమ ఆల్ట్‌ హ్యాక్‌- వైజాగ్‌ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని  విద్యార్ధి ఆవిష్కర్తలు నూతన సాంకేతికతలు అభ్యసించడంలో తగిన సాధికారితను అందించడంతో పాటుగా వెబ్‌ 3.0 వినియోగించి పరిష్కారాలను సృష్టించేందుకు సైతం తోడ్పడనుంది. ఐబీసీ ఆల్ట్‌ హ్యాక్‌-వైజాగ్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతలు, బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3.0 వంటి అంశాలలో  కీలకమైన పరిశ్రమ నాయకుల నుంచి పరిశ్రమ ధోరణి తెలుసుకునేందుకు తగిన అవకాశాలు కల్పించడంతో పాటుగా ఫంక్షనల్‌ మరియు టెక్నాలజీ వంటి అంశాలలో తగిన శిక్షణనూ అందిస్తూ విప్లవాత్మక ఆలోచనలతో వారు వచ్చేందుకు సహాయపడుతుంది, ఆ ఆలోచనలతోనే అభివృద్ధి చెందేందుకూ తోడ్పడుతుంది.
 
విజేతలుగా నిలిచిన బృందాలు ఒక మిలియన్‌ రూపాయలు+ ప్రైజ్‌ టూల్‌కు పోటీపడటంతో పాటుగా జనవరి 2023లో జరుగనున్న అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో తమ ఆలోచనలను అభివృద్ధి చేయనున్నారు. పోల్కాడాట్‌ (ఐబీసీ మీడియా యొక్క హెడ్‌లైన్‌ స్పాన్సర్‌)నుంచి వెబ్‌ 3.0 నిపుణులు చేత శిక్షణను అందించడంతో పాటుగా పాల్గొన్న అభ్యర్ధులకు రిసోర్స్‌ భాగస్వాములు అయిన టెక్‌మహీంద్రా వంటి సంస్ధల చేత తమ ఆలోచనలను మెరుగుపరుచుకునే అవకాశం అందిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) మరియు టెక్‌ మహీంద్రా మద్దతు అందిస్తున్నాయి.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథగా ప్రొఫెసర్‌ పీ. శ్రీనివాసరావు, బీటెక్‌ (హానర్స్‌), ఎంటెక్‌, డాక్టర్‌ ఇంగ్‌(మునిచ్‌), ప్రెసిడెంట్‌ , గాయత్రీ విద్యా పరిషత్‌, పూర్వ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, డీన్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ కన్సల్టెన్సీ, ఐఐటీ మద్రాస్‌, డీన్‌ ఆఫ్‌ అకడమిక్‌ కోర్సెస్‌, ఐఐటీ మద్రాస్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌ మంగళపల్లి, డైరెక్టర్‌, నాస్కమ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఐఓటీ అండ్‌ ఏఐ మరియు లావణ్య చిమట, జాయింట్‌ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ పాల్గొన్నారు.
 
ముఖ్య అతిథి  ప్రొఫెసర్‌ పి శ్రీనివాస రావు, ప్రెసిడెంట్‌, గాయత్రి విద్యా పరిషత్‌ మాట్లాడుతూ ‘‘ఐబీసీ మీడియా నిర్వహించిన ఆల్ట్‌ హ్యాక్‌ వైజాగ్‌ కార్యక్రమానికి వచ్చిన ఉత్సాహపూరిత స్పందన పట్ల సంతోషంగా ఉన్నాను. తరగతి గది లోపల మాత్రమే అభ్యాసాంశాలు నేర్చుకోవడం సాధ్యం కాదని విద్యార్థులు తెలుసుకోగలరు.ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేయడంలో సుదూరం వెళ్లగలవు. ఐబీసీ మీడియా చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. వీరు నూతన సాంకేతికతలైనటువంటి వెబ్‌ 3.0ను భారతీయ విద్యార్థుల చెంతకు తీసుకువచ్చారు’’ అని అన్నారు.
 
నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఐఓటీ అండ్‌ ఏఐ, డైరెక్టర్‌ శ్రీ కళ్యాణ్‌ మంగళపల్లి మాట్లాడుతూ ‘‘ నేడు పరిశ్రమ- ఇనిస్టిట్యూట్‌ మధ్య సంభాషణలు అత్యవసరం. దీనిద్వారా అన్ని ఫంక్షనల్‌ విభాగాలలో థియరీతో ప్రాక్టీస్‌ కలుసుకుంటుందనే భరోసా అందిస్తుంది. విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటుగా వారిని పరిశ్రమ సిద్ధంగా తీర్చిదిద్దగలదు. లైవ్‌సెషన్లు, హ్యాకథాన్స్‌, ప్యానెల్స్‌ మరియు సదస్సులు వంటి వాటి ద్వారా ఆలోచనాపరులు, నిపుణులు మరియు ప్రాక్టీషషనర్లను ఒకే దరికి తీసుకురావడం సాధ్యమవుతుంది. దీనివల్ల విద్యార్థులు ఔత్సాహిక మరియు అత్యంత నిబద్ధత కలిగిన పరిశ్రమ నిపుణుల  ఇంటెన్సివ్‌ మెంటారింగ్‌ నుంచి భారీగా ప్రయోజనం పొందవచ్చు. ఐబీసీ మీడియా ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అత్యద్భుతంగా పనిచేయడంతో పాటుగా విద్యార్ధి సమాజానికి నూతన మార్గాలనూ తెరుస్తుంది’’ అని అన్నారు
 
ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ జాయింట్‌ డైరెక్టర్‌ లావణ్య చిమట మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సరైన సమయంలో ఈ కార్యక్రమం వచ్చింది. దీనితో పాటుగావెబ్‌3.0 డెవలపర్స్‌ పరంగా ఉన్న కొరతను ఇది తీర్చనుంది. ఈ తరహా కార్యక్రమాలన్నింటికీ  ప్రభుత్వం తమ మద్దతు అందించడానికి ప్రయత్పిస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్ధి సమాజానికి తోడ్పడటంతో పాటుగా పరిశ్రమ నాయకులతో కలిసి పనిచేయడం ద్వారా  లక్ష్యమూ చేరుకోవడం వీలవుతుంది. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అధిక సంఖ్యలో వెబ్‌ 3.0 డెవలపర్లు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు
 
ఎనిమిది రోజుల పాటు అంటే డిసెంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 23 వరకూ జరిగే హైబ్రిడ్‌ ఈవెంట్‌ను ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం రూపొందించారు. తద్వారా వెబ్‌ 2.0 నుంచి వెబ్‌ 3.0కు సౌకర్యవంతంగా మారగలరు. ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రగామి కాలేజీలకు చెందిన విద్యార్థులు అభ్యసించడం, మేధోమథనం చేయడం మరియు  ఆలోచనలను పెంపొందించుకోవడంతో పాటుగా వెబ్‌ 3.0 సాంకేతికతలలో  తమ నైపుణ్యమూ మెరుగుపరుచుకోగలరు. ఈ ఫుల్‌ సైకిల్‌ ప్రోగ్రామ్‌ను సాంకేతికతపై విద్యార్ధులకు దిశానిర్ధేశం చేయడానికి, వికేంద్రీకృత ప్రపంచంలో సాంకేతికత, క్రియాత్మక అంతర్దృష్టులను అందించడానికి, వెబ్‌ 3.0లో కొత్త ఆవిష్కరణలను చేయడం మరియు వాటిని వినియోగించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. హ్యాక్‌ ఫెస్ట్‌ తరువాత,  పాల్గొన్న విద్యార్ధులకు ఐబీసీ మరియు పరిశ్రమ నుంచి  మెంటార్లు/ట్రైనర్లు కేటాయించబడతారు. వీరు విద్యార్థుల  ఆలోచనలను ప్రోటోటైప్‌/ఎంవీపీగా రూపొందించడంలో  సహాయపడతారు.
 
ఐబీసీ మీడియా ఫౌండర్‌-సీఈఓ అభిషేక్‌ పిట్టి మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఐబీసీ మీడియాకు సంబంధించి ఈ శిక్షణా కార్యక్రమం ఉచిత విద్య, సర్టిఫికేషన్‌ను పొందేందుకు విద్యార్ధులకు అపూర్వ అవకాశంగా నిలుస్తుంది. అదే సమయంలో అగ్రగామి మెంటార్ల నుంచి తగిన మార్గనిర్ధేశనం లభించడం వల్ల ప్రాజెక్ట్‌ అనుభవం, వెబ్‌ 3.0 సాంకేతికతలపై చక్కటి అనుభవమూ కలిగి పరిశ్రమ అవసరాలు తీర్చగల ప్రొఫెషనల్‌గా మారగలరు’’ అని అన్నారు.
 
గతంలో చేసిన ఆల్ట్‌ హ్యాక్‌- హైదరాబాద్‌ ఎడిషన్‌ విజయంపై ఆధారపడి ఆల్ట్‌ హ్యాక్‌-వైజాగ్‌ నిర్మించబడింది. ఐబీసీ ఆల్ట్‌ హ్యాక్‌ హైదరాబాద్‌ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనిలో  300 మంది విద్యార్ధులు ప్రత్యక్షంగా, 400 మంది ఆన్‌లైన్‌లో పాల్గొనగా, అత్యద్భుతమైన రీతిలో 1300 వెబ్‌ 3.0 ఆలోచనలు సృష్టించబడ్డాయి.