హైదరాబాద్‌లో వెబ్ 3.0 ఇండస్ట్రీ-అకడెమియా భాగస్వామ్యంపై నిర్మించబడిన ఐబీసీ 2022-23 కాంటినమ్ ఆల్ట్ హ్యాక్
వెబ్ 3.0, ఐబీసీ కాంటినమ్ 2022-23 ఆధారంగా నిర్వహించిన ఐబీసీ ఆల్ట్ హ్యాక్- హైదరాబాద్ ఎడిషన్ ముగింపు వేడుకలను నేడు హైదరాబాద్‌లోని టీ-హబ్ 2.0లో నిర్వహించారు. ఈ హ్యాక్‌ఫెస్ట్‌ను టెక్ మహీంద్రా, తెలంగాణా అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) సహకారంతో ఐబీసీ నిర్వహించింది. నవంబర్ 23 నుంచి 28 నవంబర్ 2022 వరకూ హ్యాకథాన్‌ను, టెక్ మహీంద్రా లెర్నింగ్ క్యాంపస్‌లో నిర్వహించగా, ముగింపు వేడుక టీ హబ్‌లో నవంబర్29న జరిగింది. భారతదేశంలో అతి పెద్ద వెబ్ 3.0 హ్యాకథాన్‌లలో ఒకటిగా ఐబీసీ ఆల్ట్ హ్యాక్ నిలిచింది.
ఈ హ్యాకథాన్ ముగింపు సమావేశంలో సీఐఐ తెలంగాణా, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్టార్టప్స్ కో-ఛైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ టాస్క్, సీఐఐ భాగస్వామ్యంతో ఐబీసీ మీడియా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఉచిత విద్య, సర్టిఫికేషన్ పొందాలనుకునే విద్యార్థులకు అపూర్వ అవకాశంగా నిలిచింది. దీనిద్వారా వారు ప్రాజెక్ట్ అనుభవం పొందడంతో పాటుగా వెబ్ 3.0 టెక్నాలజీస్‌పై మెరుగైన మార్గనిర్దేశకత్వమూ పొందారు అని అన్నారు
ఈ హ్యాకథాన్‌లో 300కు పైగా విద్యార్ధి డెవలపర్లు పాల్గొనడంతో పాటుగా ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్స్‌పై పనిచేశారు. తొమ్మిదిరోజుల పాటు జరిగిన ఈ వెబ్ 3.0 హ్యాకథాన్‌లో పలువురు నిపుణుల చేత ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలూ జరిగాయి. ఈ నిపుణులలో మోరాలిస్ నుంచి శివమ్, వెబ్ 3.0 ఫౌండేషన్ నుంచి డాక్టర్ రాధాకృష్ణ దాసరి ; వెబ్ 3 నిపుణులు సెల్వరాజు, ఐబీసీ మీడియా సీఓఓ ప్రవీణ్ ఠాకూర్ ఉన్నారు.
ఐబీసీ మీడియా సీఈఓ-ఫౌండర్ అభిషేక్ పిట్టి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది డెవలపర్లకు అవగాహన కల్పించేందుకు స్కిల్–ఏ–థాన్ శీర్షికన హ్యాకథాన్ కోసం నూతన నమూనాగా వెబ్ 3.0 కోసం ప్రతిభావంతులను సృష్టించేందుకు , తెలంగాణా నుంచి ప్రపంచానికి తీసుకువెళ్లే కొత్త ప్రోగ్రామ్‌ను మేము రూపొందిస్తున్నాము అని అన్నారు. ఐబీసీ నిర్వహించిన ఈ హ్యాకథాన్‌ను విజయవంతంగా తెలంగాణాలో 700 పాఠశాలల వ్యాప్తంగా నిర్వహించామని దాదాపు 20వేల మంది విద్యార్థులు హైబ్రిడ్ ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ ఫార్మాట్‌లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు.