ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (17:41 IST)

విదేశాల నుంచి తండ్రి తెచ్చిన చాక్లెట్.. ఊపిరాడక బాలుడి మృతి

Chocolate Day
తెలంగాణలోని వరంగల్‌‌లో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ను తిని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్న కంగన్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. కంగన్ సింగ్ తనయుడు సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
రాజస్థాన్‌కు చెందిన కంగన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు చేరుకుని కుటుంబంతో పాటు నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన కంగర్ సింగ్ తన పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. 
 
సందీప్ శనివారం తన పాఠశాలకు కొన్ని చాక్లెట్లు తీసుకెళ్లాడు. రెండో తరగతి విద్యార్థి నోటిలో చాక్లెట్ పెట్టగా అది గొంతులో ఇరుక్కుపోయింది. క్లాసులోనే కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పోరాడినా ఫలితం లేకపోయింది. వైద్యులు రక్షించేందుకు ప్రయత్నించినా సందీప్ ఊపిరాడక మృతి చెందాడు.