శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (12:19 IST)

మూడుతరాల ప్రేక్షకాభిమానం పొందిన నటుడు కైకాల : సీఎం కేసీఆర్

kcrao
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన ఓ ప్రకటన చేశారు. మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు కైకాల అంటూ ప్రశంచించారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. 
 
తెలుగు చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ తన వైవిధ్య నటన ద్వారా మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం కేసీఆర్ అన్నారు. సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.