గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (08:28 IST)

లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ ఇకలేరు...

kaikala
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... హైదరాబాద్ ఫిల్మ్ నగరులోని ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో వైద్యులు చికిత్సకు స్పందించక ప్రాణాలు విడిచారు. 770కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన "సిపాయి కూతురు" అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.

ఆ తర్వాత పౌరాణికం, జానపదం, కమర్షియల్, ఇలా ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రల్లో కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్నారు, కృష్ణ, శోభన్ బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు తదితరుల చిత్రాల్లోనూ నటించారు. ఈయన వయసు 87 సంవత్సరాలు. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు జరుగనున్నాయి.