శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (09:35 IST)

ట్విట్టర్‌లో #RipLegend ట్రెండింగ్ - కె.విశ్వనాథ్ మృతిపై సంతాపాల వెల్లువ

viswanath
కళాతపస్వీ కె.విశ్వనాథ్ శివైక్యంపై తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాలను తెలుపుతున్నారు. ఎన్నో అపురూప చిత్రాలను అందించిన కె.విశ్వనాథ్ గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ కన్నుమూశారు. ఆయన మృతిపై అనేకమంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 
 
కె.విశ్వనాథ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన వారిలో కె.విశ్వనాథ్‌ది ఉన్నతమైన స్థానమని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. శంకరాభరణం, సాగరసంగమం వంటి ఎన్నో అపరూపమైన చిత్రాలని అందించారని తెలిపారు. విశ్వనాథ్ కుటుంబానికి తనక ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు థమన్, గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలు విశ్వనాథ్ మృతిపట్ల తన ప్రగాణ సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్లు చేశారు.