కళా తపస్వి విశ్వనాథ్ మాస్టర్‌కు సెల్యూట్ : కమల్ హాసన్
కళా తపస్వి విశ్వనాథ్ మృతి చెందడం చాలా బాధగా వుంది. జీవితం అంటే ఏమిటో పూర్తిగా అవపోసన పట్టి వాటిని చిత్రాల్లో వ్యక్తం చేసిన గొప్ప దర్శకుడు. మన సంస్కృతిని వెలికితెచ్చి జీవం పోసిన కళాకారుడు ఆయన జీవితంలో ఈ రెండు శాశ్వతంగా కీర్తిని సంపాదించి పెట్టాయి. ఆయన నాకు మాస్టర్ లాంటివాడు.
మాస్టర్‌కు సెల్యూట్ చేస్తున్నానంటూ కమల్‌హాసన్ స్వ దస్తూరితో రాసిన లెటర్ పోస్ట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాని, దర్శకుడు బాబీ వంటి ప్రముఖులు కూడా విశ్వనాథ్ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.