1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:25 IST)

ఇండియన్‌2 నుంచి కమల్‌హాసన్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌

Kamal Haasan special choper
Kamal Haasan special choper
కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా సినిమా ఇండియన్‌ 2. తెలుగులో భారతీయుడు2గా రూపొందుతోంది. దీనికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విక్రమ్‌ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న కమల్‌ హాసన్‌ ఇప్పుడు గేప్‌ తీసుకుని ఇండియన్‌ 2కు సిద్ధమయ్యాడు. చిత్ర షూటింగ్‌లో భాగంగా తను స్పెషల్‌ ఛాపర్‌ నుంచి బయట నిలబడ్డ స్టిల్‌ను తన సోషల్‌ మీడియాలో కమల్‌ హాసన్‌ పోస్ట్‌ చేశాడు. 
 
తాజా సమాచారం మేరకు ఈ చిత్రం షూటింగ్‌ తిరుపతి పరిసరాల్లో జరుగుతుందని తెలుస్తోంది. తను స్టయిలిష్‌గా వున్న ఫొటోలకు ఆయన అభిమానులు బహువిధాలుగా స్పందిస్తున్నారు. కాశ్మీర్‌ వెళ్ళడానికి సిద్ధంగా వున్నాడు. నేవీడే సందర్భంగా సిద్ధమవుతున్న కమల్‌ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఛాపర్‌ కేవలం షూటింగ్‌ కోసమే ఉపయోగిస్తున్నాడనేదికూడా వినపబడతుతోంది. లైకా ప్రొడక్షన్‌ బేనర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.