బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (18:40 IST)

సూర్యతో రోలెక్స్‌ పేరుతో చిత్రం రాబోతుందా?

Suriya
Suriya
కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమాలో క్లయిమాక్స్‌లో వచ్చిన సూర్య పాత్ర రోలెక్స్‌. ఆ సినిమాలో విజయ్‌ సేతుపతితోపాటు సూర్య నటించారు. వీరి పాత్రలు ఆడియన్స్‌ను మెప్పించాయి. అందుకే పూర్తిస్థాయిలో రోలెక్స్‌ పాత్రపైనే విక్రమ్‌ సీక్వెల్‌ వుంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిని ఎవరూ ఖండిరచలేదు. కాగా, ప్రస్తుతం రోలెక్స్‌ పేరుతో సరికొత్తగా ఓ సినిమా వుండబోతుందని టాక్‌ వినిపిస్తోంది. అందుకు కారణం దర్శకుడు కనగ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే.
 
దర్శకుడు లోకేష్‌ కనగ్‌ రాజ్‌ యూనివర్స్‌ లో ఆల్రెడీ విజయ్‌ తో సినిమా నెక్స్ట్‌ విక్రమ్‌ 2 అలాగే ఖైదీ 2 లను ఫిక్స్‌ చేయగా లేటెస్ట్‌ గా ‘‘రోలెక్స్‌’’ సినిమాపై కూడా ఓ  ఇంటర్వ్యూలో చెప్పాడు. తన యూనివర్స్‌ లో విక్రమ్‌ 2 అలాగే ఖైదీ 2  సినిమాలతో పాటుగా రోలెక్స్‌ పై కూడా సినిమా కూడా ఉంటుంది అే చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో ఈ స్టేట్మెంట్‌ కోలీవుడ్‌ వర్గాల్లో మంచి వైరల్‌ అవుతుంది.