శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆస్కార్‌‍కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం "స్వాతిముత్యం"

kviswanath
తన మొదటిచిత్రంతోనే పేరు తెచ్చుకున్న లెజండరీ దర్శకుడు కె.విశ్వనాథ్.. ఆ తర్వాత వరుసగా చెల్లెలి కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటివరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలకు విశ్వనాథఅ ఓ కొత్త దిశను చూపారు. "సిరిసిరిమువ్వ" చిత్రంతో విశ్వనాథ్ తెలుగు సినీ పరిశ్రమకు తన విశ్వరూపాన్ని చూపించారు. సంస్కృతిని చాటి చెప్పేందుకు సినిమాలో సరైన మాధ్యమని ఆయన భావించేవారు. 
 
ఇక తెలుగు సినీ చరిత్రలో "శంకరాభరణం" ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇక "శుభసంకల్పం" చిత్రంలో ఆయన తొలిసారి నటుడిగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో 30కి పైగా నటించారు. కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన "స్వాతిముత్యం" (1985) చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. అలా ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి చిత్రంగా స్వాతిముత్యం నిలిచింది.