గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (08:12 IST)

'శంకరాభరణం' విడుదలైన రోజే 'విశ్వనాథ్ శివైక్యం'

kviswanath
తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ మన మధ్య ఇకలేరు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన కాశీనాథుని విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో చిత్రపరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది.
 
ఈ లెజండరీ దర్శకుని సృజనాత్మకకు ప్రతిరూపమైన మరో ఆణిముత్యం "శంకరాభరణం". ఆయన చిత్రాల్లో "శంకరాభరణం" చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2వ తేదీన ఆ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రానికి ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ అత్యంత ప్రజాదారణ పొందింది. 
 
ఈ చిత్రానంతరమే కె.విశ్వనాథ్ పేరుకు ముందు కళాతపస్వీ వచ్చి చేరింది. అయితే, ఇక్కడ విచిత్రమేమిటంటే... "శంకరాభరణం" విడుదలైన రోజే విశ్వానాథ్ శివైక్యం చెందడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది.