జన్మ భూమికి సార్ధకం చేనిన కళా తపస్వి : నందమూరి బాలకృష్ణ
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించే ల ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమా కే గర్వ కారణము. నేను నటించిన జనని జన్మ భూమి చిత్రంలో మాతృదేశం గురించి, విలువలు గురించి చక్కగా చెప్పారు. ఆయనతో నటించే భాగ్యం కలిగింది. 1984 లోవచ్చిన సినిమా. శ్రీ భ్రమరాంబికా ఫిల్మ్స్ పతాకంపై కె విశ్వనాథ్ దర్శకత్వంలో కోగంటి కేశ్వరావు నిర్మించాడు.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. ఆయన లోటు తీర్చలేనిది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.