గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

వీరిలో జంతువులు ఎవరు.. మనుషులు ఎవరో చెప్పండి?

dogpuppu in air
ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ షేర్ చేసిన ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుక్కపిల్ల కాళ్లను చెరోవైపు పట్టుకుని గాల్లో గింగిరాలు తిప్పిన అమ్మాయి అబ్బాయి. గాల్లో ఎగురవేస్తూ వికృతానందం పొందారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారిద్దరితో వారి వికృత చేష్టలను షూట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ వీడియోను షేర్ చేసిన ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్.. వీరిలో జంతువు ఎవరు? (జాన్‌వర్ కౌన్?) అని ప్రశ్నించారు. ఆ వీడియోలో ఓ అమ్మాయి, యువకుడు ఉన్నారు. ఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు. కుక్కపిల్లను యువకుడు రెండు కాళ్లతో వేలాడదీస్తూ, గాలిలో తిప్పుతూ వికృతానందం పొందాడు.
 
ఆ పక్కనే గోడపై ఉన్న కోతులకు కుక్క పిల్లను చూపిస్తూ వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు? జంతువు ఎవరో? చెప్పాలని శరణ్ ఆవేదనగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 
 
కుక్క పిల్లను హింసించిన యువకుడు, అమ్మాయితోపాటు ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇద్దరితోపాటు దానిని షూట్ చేసిన వ్యక్తి... మొత్తం ముగ్గురూ జంతువులేనని, తన ఎదురుగా కనుక ఇలా చేసి ఉంటే వారి మూతి పగలగొట్టి ఉండే వాడినని ఓ యూజర్ కామెంట్ చేశాడు.