శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (13:38 IST)

కన్నబిడ్డను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు

flight
కన్నబిడ్డను ఉద్దేశ్యపూర్వకంగా విమానాశ్రయంలోనే వదిలి వెళ్లారు.. ఆ తల్లిదండ్రులు. చిన్నారిని విమానంలోకి అనుమతించాలంటే.. టికెట్ తీసుకోవాల్సిందేనని ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుబట్టడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎయిర్ పోర్టులోనే వదిలి వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
ఇజ్రాయేల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  తల్లిదండ్రులు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విమానాశ్రయానికి శిశువుతో వచ్చారు. చిన్నారికి టికెట్ ఇప్పించాలని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
 
ఆ తర్వాత దంపతుల మధ్య వాగ్వాదం జరిగి చిన్నారిని ఎయిర్‌పోర్టులో వదిలి విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన విమానాశ్రయ అధికారి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు హుటాహుటిన వెళ్లి తల్లిదండ్రులను విచారించారు. చిన్నారిని వదిలి వెళ్లేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు.