శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (15:24 IST)

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఫ్లైవుడ్ గోదాంలో నిప్పు

హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. వేగంగా వ్యాపిచంటంతో గోదాం మొత్తం కాలి బూడిదైంది. 
 
మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతూ వుండటంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.