ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (19:39 IST)

స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఆరుగురు బాలికలపై అత్యాచారం

rape
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ వ్యత్తికే కళంకం తెచ్చాడు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఏకంగా ఆరుగురు మైనర్ విద్యార్థినులను అత్యాచారానికి పాల్పడ్డాడు. సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు బానిసైన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ జిల్లాలోని సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రమేష్ చంద్ర కటారా అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నాడు. తాజాగా సదర్ పోలీస్ స్టేషన్లలో 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆరుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఇంకా నిందితుడి వద్ద రెండు మొబైల్స్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.