శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. ప్రియుడి ఇంట్లో ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ ప్రాంతానికి చెందిన దయాకర్, పూజ అనే యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. 
 
దీంతో వీరిద్దరి వివాహానికి దయాకర్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రులను ఒప్పించాలన్న ఉద్దేశంతో దయాకర్.. పూజను ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో ఉండగా.. దయాకర్ తల్లిదండ్రుల మాటలు విని తీవ్ర మనస్తాపానికి గురైన పూజ... పక్కనే ఉన్న గదిలో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుడు దయాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.