శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (20:44 IST)

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌- సచిన్ రికార్డ్ బ్రేక్.. ముషీర్ ఖాన్ అదుర్స్

Musheer Khan
Musheer Khan
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ముషీర్ ఖాన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 136 పరుగుల భారీ సెంచరీ బాదిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు. 
 
19 ఏళ్ల 41 రోజుల వయసులో ముషీర్ ఖాన్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1994/95 సీజన్ ఫైనల్‌లో పంజాబ్‌పై రెండు సెంచరీలు బాదాడు. అయితే సచిన్ కంటే తక్కువ వయసులోనే ముషీర్ ఖాన్ సెంచరీ బాదడం రికార్డుగా నిలిచింది. 
 
కాగా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 528 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224, రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది.