సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యురేనియం కోసం అన్వేషణ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
- ఈ పాలనలో వున్నందుకు బాధపడుతున్నానంటూ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఆ వీడియో ఎప్పటిది?
- లైవ్ ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన సింగర్.. ఎక్కడ?
- ఆ విషయంలో కేరళను చూసి నేర్చుకోవాల్సిందే..
- నాగార్జున అక్కినేని నా సామిరంగలో అంజిగా అల్లరి నరేష్
ధోనీ జెర్సీ నెంబర్ 7 రిటైర్.. మహీకి అరుదైన గౌరవం
దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ 7ను ప్రత్యేకంగా వుంచనుంది. ఈ నెంబర్‌ను ఏ ఆటగాళ్లకు కేటాయించకుండా అలానే వుంచనుంది. ఇందులో భాగంగా ధోనీ జెర్సీ నంబర్ 7ను ఏ ఇతర ఆటగాళ్లకు ఇవ్వకుండా రిటైర్ చేసింది.
గతంలో సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10ని కూడా బీసీసీఐ రిటైర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా ధోనీ జెర్సీ నెంబర్‌ని కూడా రిటైర్ చేయనుంది. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా అందుకుంది.
మహీ తన కెరీర్‌లో 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో చివరిసారిగా టీమిండియా జెర్సీ ధరించాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
