ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (14:20 IST)

లండన్ యూనివర్సిటీ సారా టెండూల్కర్ మెడిసిన్- డిస్టింక్షన్‌లో పాస్

Sara Tendulkar
Sara Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రియమైన కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం, సారా షేర్ చేసిన అలాంటి పోస్ట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. 
 
ఈ పోస్ట్ ద్వారా ఆమె లండన్‌లో తన ఉన్నత చదువుల గురించి అందరికీ తెలియజేసింది.  సారా పాఠశాల విద్య ముంబైలోని 'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్'లో ముగిసింది. దీని తర్వాత సారా ఉన్నత చదువుల కోసం లండన్ యూనివర్సిటీలో చేరింది. 
 
గత కొన్ని సంవత్సరాలుగా, సారా కాలేజ్ ఆఫ్ లండన్‌లో మెడిసిన్ చదువుతోంది. ఈ కోర్సు ఫలితాలను యూనివర్సిటీ ప్రకటించింది. సారా 'క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్' కోర్సులో మాస్టర్స్ డిగ్రీని సాధించింది. సారా టెండూల్కర్ 75 శాతానికి పైగా (డిస్టింక్షన్) మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తన ఫలితాల కార్డ్‌కి సంబంధించిన మొదటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.