సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (10:43 IST)

రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడిన షమీ.. వీడియో వైరల్

Shami
Shami
స్టార్ ఇండియన్ సీమర్ మహ్మద్ షమీ నైనిటాల్‌లో రోడ్డు ప్రమాద బాధితుడిని రక్షించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. అతను చాలా అదృష్టవంతుడని.. దేవుడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడని షమీ తెలిపాడు. అతని కారు నైనిటాల్ సమీపంలోని కొండ రహదారి నుండి తన కారుకు ఎదురుగా పడిపోయింది. అతడిని చాలా సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
 
అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన షమీ స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టులో సభ్యుడు.
 
మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా వున్న షమీ ఈ మెగా టోర్నమెంట్‌ను 10.71 సంచలన సగటుతో 5.26 ఎకానమీతో అద్భుతమైన 24 వికెట్లతో రాణించాడు.