శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 నవంబరు 2023 (15:37 IST)

ఓటమి భారంతో కుంగిన మహ్మద్ షమీని అక్కున చేర్చుకున్న ప్రధాని మోదీ

PM Modi-Shami
ప్రపంచ కప్ మనదే అనుకుని టీవీలకు అతుక్కుపోయి వీక్షించిన కోట్లాది క్రికెట్ అభిమానులకు నిన్నటి టీమిండియా ఓటమి ఎంతో నిరాశను మిగిల్చింది. ఐతే టీమిండియా ఆటగాళ్ల ఆటతీరుపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు తలరాత, దురదృష్టం అంటుంటే మరికొందరు ఫైనల్స్ అనే జాగ్రత్త లేకుండా షరామామూలుగా ఆడేసారు అందుకే ఓడారు అని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... నిన్న టీమిండియా ఆటగాళ్లు ఓటమి భారంతో మైదానం నుంచి డ్రెస్సింగ్ రూముకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చారట. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి చేరుకుని ప్రతి ఒక్క ఆటగాడిలో మనోధైర్యం నింపారు. క్రీడల్లో గెలుపుఓటములు సహజమనీ, ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలంటూ అందరినీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ ప్రధాని మోదీ ఓదార్పును ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 
 
ట్విట్టర్లో షమీ కోట్ చేస్తూ... ''దురదృష్టవశాత్తు నిన్న మన రోజు కాదు. టోర్నీ అంతటా మన జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోదీకి ధన్యవాదాలు. మాలో ఉత్సాహాన్ని పెంచడం కోసం ఆయన ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చారు. మేము తిరిగి బౌన్స్ చేస్తాము''