గుంటుపల్లి గుహల వద్ద నిద్ర చేస్తే సంతానం కలుగుతుందట!
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గుంటుపల్లి గుహల వద్ద నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ గుహలను ఆంధ్ర అజంతా గుహలు అని కూడా పిలుస్తారు. ఈ కొండపై ధర్మ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఓ గుహలో కొండపై కొండటి ఆకారంలో ఉన్న రూపాన్ని ధర్మ లింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు.
ధర్మ లింగేశ్వర స్వామి ముందు సంతానం లేని మహిళలు పానాసారం చేస్తే సంతానము కలుగుతుందని విశ్వాసం. అందుకనే వాటిని సంతాన గుహలను కూడా పిలుస్తారు. సంతానం లేని మహిళలు గుంటుపల్లి గుహలలో ఉన్న ధర్మ లింగేశ్వర స్వామిని కార్తీక మాసంలోని సోమవారాలలో ప్రత్యేకించి పూజిస్తారు.
పూజలో భాగంగా మహిళలు స్వామిని దర్శించి, గుహ లోపల శివలింగ ఆకారంలో ఉన్న గుండ్రటి గోళం చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం తడి బట్టలతో గుహ బయట నిద్ర చేస్తారు.
అలా నిద్ర చేసే సమయంలో ధర్మ లింగేశ్వర స్వామి మహిమ చేత స్వప్నంలో పళ్ళు, పూవులు కనిపిస్తే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. దీనినే పానాసారం అంటారు.
మరోవైపు బౌద్ధ బిక్షవులు తిరుగాడిన ప్రదేశంగా, ప్రముఖ బౌద్ధ క్షేత్రం గానే కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రం గా కూడా గుంటుపల్లి గుహలకు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.