ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (11:40 IST)

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లు

train
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలంగాణాతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 64 రైళ్లను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ఇందులో సికింద్రాబాద్ - కొల్లం మధ్య డిసెంబరు 10, 17, 24, 31, జనవరి 9, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అలాగే, నర్సాపూర్ - కొట్టాయం మధ్య డిసెంబరు 10, 17, 24, 31, జనవరి 7, 14 తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు డిసెంబరు 12, 19, 26, జనవరి 9, 16, అలాగే, కొట్టాయం నుంచి నర్సాపూర్‌కు డిసెంబరు 11, 18, 25, జనవరి 1, 8, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతామని తెలిపింది. 
 
అదేవిధంగా, ఏపీలోని శ్రీకాకుళం రోడ్ - కొల్లం ప్రత్యేక రైళ్లు నవంబరు 25, డిసెంబరు 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో ఉంటాయి. విశాఖపట్నం - కొల్లం మధ్య నవంబరు 29, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో ఉంటాయి. కొల్లం నుంచి శ్రీకాకుళం రోడ్‌ నవంబరు 26, డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో, కొల్లం నుంచి విశాఖపట్నానికి నవంబరు 30, డిసెంబరు 7, 1,4, 21, 28 జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ రైళ్లలో మొదటి, రెండు, మూడు శీతలీకరణ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్, జనరల్ బోగీలు కూడా ఉంటాయని పేర్కొంది.