బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (10:41 IST)

దసరా రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు

train
దసరా పండుగ సమయంలో ఏర్పడే రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కాచిగూడ - కాకినాడ మధ్య ఈ ప్రత్యేక రైలు సర్వీసును నడుపనుంది. అలాగే, ఈ నెల 19, 26వ తేదీల్లో ఈ రైలు కాచిగూడ నుంచి రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో 20, 27 తేదీల్లో కాకినాడ నుంచి సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి - టీ కాంగ్రెస్ జాబితా ఇదే.. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే, మైనంపల్లి హన్మంతరావు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా ఆయనకు మల్కాజిగిరి స్థానం నుంచి సీటును కేటాయించారు. కొల్లాపూర్ నుంచి జూపల్లి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిలు పోటీకి దిగుతున్నారు. మొత్తం 55 మందితో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్ ఈ జాబితాను విడుదల చేశారు. 
 
ఇటీవల తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, పూర్వ కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావుకు కూడా సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌ను కేటాయించారు. అలాగే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ సీటు ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్‍‌‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు అనుకున్నట్టే కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. 
 
ఆయనకు మాల్కాజిగిరిని కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మాత్రం మెదక్ స్థానాన్ని ఇచ్చింది. ఆంధోల్ రిజర్వు స్థానాన్ని మాజీ మంత్రి దామోదర రాజనర్శింహా, మంథని నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు బరిలోకి దిగుతున్నారు. సీతక్క తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచి పోటీ పడుతున్నారు.