బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (10:13 IST)

రాష్ట్ర కౌన్సిల్ ప్రారంభ సమావేశం: అసోచామ్ తెలంగాణకి నూతన కో-ఛైర్మన్‌

image
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) తెలంగాణ చాప్టర్ తమ మొట్టమొదటి స్టేట్ కౌన్సిల్ సమావేశాన్ని ఈరోజు హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్‌ శ్రీ కటారు రవికుమార్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమంలో, CtrlS డాటా సెంటర్స్ & Cloud4C వ్యవస్థాపకులు మరియు సీఈఓ శ్రీ శ్రీధర్ పిన్నపురెడ్డిని అసోచామ్ తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కో-ఛైర్మన్‌గా ఎన్నికున్నారు. శ్రీ  పిన్నపురెడ్డి, తొలి తరం వ్యాపారవేత్త మరియు టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి, ఆయన 2023-24 సంవత్సరానికి అసోచామ్ కో-ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

శ్రీ పిన్నపురెడ్డి, వ్యవస్థాపక ప్రయాణం క్లౌడ్ కంప్యూటింగ్, ఐటి మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ సేవలు, గ్రీన్ ఎనర్జీ మరియు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో విజయవంతమైన వెంచర్‌లను ప్రదర్శిస్తుంది. ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్ (TiE) గ్లోబల్ సమ్మిట్‌కు చాప్టర్ ప్రెసిడెంట్ మరియు చైర్‌పర్సన్‌గా సేవలనందించిన శ్రీ పిన్నపురెడ్డి అసోచామ్‌తో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ (EO) మరియు యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ (YPO) వంటి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్లలో కూడా సభ్యత్వాలను కలిగి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్ కటారు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. ప్రధాన పరిశ్రమలలోని అవకాశాలను అన్వేషించడం కోసం ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయడంలో రాష్ట్ర అభివృద్ధి మండలి యొక్క లక్ష్యాన్ని ఆయన వివరించారు. రాబోయే ఎన్నికలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో అవసరమైన సవరణల కోసం కౌన్సిల్ సిఫారసులను అందజేస్తుందని శ్రీ రెడ్డి వెల్లడించారు.