టీటీడీ వెబ్ సైట్ పేరు మారింది.. భక్తులు గమనించగలరు..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్ సైట్ పేరు మారింది. ఇప్పటివరకు tirupatibalaji.ap.gov.in అని అనే సైట్ అడ్రెస్ ttdevasthanams.ap.gov.in అని మారినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ వెబ్‌సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు.