28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?
ఈ నెల 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున పాక్షి చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7.05 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం పూర్తి చేసిన తర్వాత 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. అంటే మొత్తం 8 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ.
అందువల్ల 28వ తేదీన రాత్రి 7.05 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 3.15 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత సుప్రభాత సేవల అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత నుంచి యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనాలను 28వ తేదీన రద్దు చేశారు. అలాగే పెరటాసి రద్దీ కారణంగా సోమవారం కూడా ఎస్ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.