1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (19:05 IST)

తరగతి గదిలో తాళి కట్టాడు.. పెళ్లయిందంటూ అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

Rape
తన వద్ద చదువుకునే పదో తరగతి చదువుకునే బాలికను ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. తరగతి గదిలోనే తాళి కట్టాడు. ఆ తర్వాత పెళ్లయిపోయిందంటూ అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
భీమవరం గ్రామీణం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమవరాజు అనే వ్యక్తి జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రేమిస్తున్నారనని, పెళ్లి చేసుకుంటామని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని ఈ నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. 
 
అక్కడే తాళి కట్టి పెళ్లయిందని చెప్పారు. ఆపై అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ మేరకు బుధవారం బాధతురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, పోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీచేశారు.