బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (19:11 IST)

ఐపీఎల్ 2024 సంబరాలు ప్రారంభం- అదరగొట్టిన స్టార్స్

IPL 2024
IPL 2024
ఐపీఎల్ 2024 సంబరాలు ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫెర్మార్మెన్స్ ప్రారంభం అయ్యింది. ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలో మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, ప్రఖ్యాత గాయకుడు సోనూ నిగమ్ వంటి స్టార్లు పాల్గొన్నారు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ శుక్రవారం నుంచి చెన్నైలో ప్రారంభం అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లలోనూ మంచి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
 
విరాట్ కోహ్లీ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉన్నాడు. 2010 నుంచి కోహ్లీ 300 కంటే తక్కువ పరుగులు చేసిన ఒక్క సీజన్ కూడా లేదు. గత సీజన్‌లో కూడా అతను 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. 
IPL-2024
IPL-2024
 
ఐపీఎల్ 2023లో రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచ్‌లు ఆడి 590 పరుగులు చేశాడు. ఈసారి అతను మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నారు. ఎంఎస్ ధోని చెన్నై కెప్టెన్సీని వదిలిపెట్టి, రితురాజ్ గైక్వాడ్‌కు జట్టు పగ్గాలు అప్పగించడంతో ఫ్యాన్స్ కళ్లంతా అతనిపైనే వున్నాయి.