బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (21:26 IST)

రోహిత్ శర్మ 200 మ్యాచ్‌ల రికార్డ్.. ధోనీ, కోహ్లీకి తర్వాత..?

Rohit Sharma
Rohit Sharma
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 
 
ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్ తరపున 200 మ్యాచ్‌ల ఘనతను అందుకున్నాడు. రోహిత్ శర్మ కన్నా ముందు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఫీట్ సాధించారు. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను 200 నెంబర్ జెర్సీ‌తో సత్కరించింది. 
 
2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.