శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (14:56 IST)

ధోనీ కెప్టెన్సీ గోవిందా.. స్పందించిన రోహిత్ శర్మ

rohit sharma
ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని కేప్టెన్ హోదా నుంచి తప్పించింది. అతని స్థానంలో డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది. దీనిపై ముంబై ఇండియన్స్ మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 
 
ఎంఎస్ ధోనీని జట్టు కెప్టెన్‌గా తొలగించి, రుతురాజ్ గైక్వాడ్‌ను అపాయింట్ చేసిన వెంటనే రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌కు పని చెప్పాడు. 
 
ధోనీతో కలిసి దిగిన ఓ ఫొటో, దానికి షేక్ హ్యాండ్ ఎమోజీని యాడ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ సీజన్‌కు రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌ ఉండట్లేదనే విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కూడా అతన్ని కెప్టెన్‌గా తప్పించిన సంగతి తెలిసిందే.