గురువారం, 25 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (16:20 IST)

సీఎస్కే కెప్టెన్సీ ఇక ధోనీకి కాదు.. కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2024లో ధోనీకి చుక్కెదురైంది. ఐపీఎల్ 2024కి ముందు ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 
 
దీంతో ధోనీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ధోనీ చెన్నైకి కెప్టెన్‌గా వున్న సంగతి తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో ఐదు సార్లు సీఎస్కే టైటిల్‌ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతో పాటు ధోనీ కెప్టెన్సీలో చెన్నై అత్యధికంగా టైటిల్ గెలుచుకుంది. 

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ పోరు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు చేపాక్ స్టేడియం వేదికగా మారింది. స్టార్ ప్లేయర్లకు కొదవలేని ఇరు జట్లు ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతున్నాయి.