ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (10:49 IST)

చెన్నైలో ధోనీ... పొడవాటి జుట్టు పాత లుక్.. వైరల్

Dhoni
Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ మొదలెట్టాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టేడియంలోకి రాగానే క్రికెట్ అభిమానులు ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నెట్టింట షేర్ చేసింది. 
 
ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ధోని తన పాతకాలపు పొడవాటి జుట్టు రూపంలో కనిపించాడు. ధోనీ ఈ లుక్ సంవత్సరాలుగా క్రికెట్ అభిమానుల హృదయాలలో నిలిచిపోయిన లెక్కలేనన్ని జ్ఞాపకాలను గుర్తుచేసింది.