గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (09:39 IST)

అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోనీ

dhoni
dhoni
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు జరిగిన వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దాండియా ఆడాడు. ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. 
 
ఈ వేడుకలో మహేంద్ర సింగ్ ధోనీ దాండియా ఆడుతూ కనిపించాడు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ బ్రావోతో చాలా హ్యాపీగా, సరదాగా దాండియా ఆడాడు. ఈ దాండియా డ్యాన్స్‌లో ధోనీ భార్య సాక్షి కూడా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో పాటు, టాలీవుడ్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.